భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎంతో పాటు మంత్రులను కలుస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులను త్వరగా, నాణ్యతతో చేపట్టాలని ఆఫీసర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పాల్వంచ : పట్టణంలోని అభ్యు దయ పాఠశాలలో అదనపు తరగతి గదులు, కరక వాగులో రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే కూనంనేని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు పట్ల అందరూ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, తహసీల్దార్ వివేక్, అధికారులు, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.