- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచ రూరల్, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం పాల్వంచ మండలం గంగదేవిగుప్ప, దంతెలబొర, బండ్రగూడెం, నారాయణరావుపేట, సంగం, రేపల్లెవాడ, బొజ్జాతండా, నాగారం, రంగాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పన కోసం కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగా సీతారాములు, టీడీపీ రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు, అడుసుమల్లి సాయిబాబు, వడ్లమూడి పూర్ణ, ఇట్టి వెంకట్రావు, ఎస్ శ్రీనివాసరావు, బాలినేని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.