జీపీ కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో రూ.కోటితో నిర్మాణం చేసిన జీపీ కార్యాలయాలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. మండల పరిధిలోని కొత్తసూరారం, మందెరికలపాడు, రంగాపురం కాలనీ, పాతసూరారం, గ్రామాల్లో ఒక్కొక్క గ్రామపంచాయతీ కార్యాలయానికి రూ.20లక్షలతో నిర్మాణం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా పాల్వంచ మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్​ నాగరాజు, ఎంపీడీవో అప్పారావు,  డీసీఎంఎస్​ వైస్​ చైర్మన్  కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బీ.వాసుదేవరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే షబీర్​పాషా, రైతుసంఘ నాయకులు ముత్యాల విశ్వనాథం, జాలె జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.