- సౌత్ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
- సినీ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, నేహాశెట్టి సందడి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రికొత్తగూడెంకు షాపింగ్ మాల్స్ రావడం అభివృద్ధికి దోహదం చేస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌ను ఎమ్మెల్యేతో పాటు సినీ హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, నేహశెట్టి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్ఇండియా షాపింగ్ మాల్ రాకతో దాదాపు రెండు, మూడు వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సినీ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, నేహాశెట్టి సందడి చేశారు. పలు రకాల వస్త్రాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న రకాలతో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ కొత్తగూడెం ప్రజల వద్దకు వచ్చిందన్నారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్ మాట్లాడుతూ అనుకూలమైన ధరలలో, సరికొత్త డిజైన్లను, నాణ్యమైన బట్టలను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చన్నారు. దసరా, దీపావళి సందర్భంగా అన్ని రకాల వెరైటీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో జడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కే. సీతాలక్ష్మి, నాయకులు సాబీర్ పాషా ఉన్నారు.