గిరిజనుల ఆరాధ్య దైవం సంత్​ సేవాలాల్ : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్​ సేవాలాల్ : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

కామేపల్లి, వెలుగు  : సమాజ  శ్రేయస్సుకు మార్గం చూపి, నిరంతరం గిరిజనుల అభివృద్ధికి పాటుపడి సంత్​ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం అయ్యారని  ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో మండల స్థాయిలో  జరిగిన సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. గిరిజనులందరినీ  ఒక్క తాటిపై నడిపిన సంత్ సేవాలాల్ ఆశయాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చిన కామేపల్లి చెందిన మదార్  దంపతులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు భానోత్ సుజాత మంగీలాల్, కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు, పూజారి రమేశ్, ఎల్ హెచ్ పీఎస్ మండల అధ్యక్షుడు భూక్య నాగేంద్రబాబు, మాజీ సర్పంచులు జర్పల రామారావు, అజ్మీరా రామదాస్, అర్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతి 

మండల పరిధిలోని ముచ్చర్ల ఎక్స్ రోడ్ నుంచి ఏన్కూర్, తాళ్ల గూడెం నుంచి పింజరమడుగు, ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే రోడ్ల డ్యామేజ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రిపేర్లు చేయించాలని కోరుతూ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంఓల సంఘం మండల కార్యదర్శి బాదావత్ శ్రీను, నాయకులు ‌మంగీలాల్, హరి, రాజు ఉన్నారు.