బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కోరం పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కోరం పరామర్శ

కామేపల్లి. వెలుగు : ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు సాతాను గూడెం, తాళ్ల గూడెం గ్రామాలకు చెందిన బోరిగొర్ల సురేశ్, మద్దినేని అనంతరామయ్య కుటుంబ సభ్యులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం తాళ్ల గూడెం గ్రామంలో మహిళకు సబ్సిడీ గ్యాస్ రాయితీ మంజూరు పత్రాలను అందజేశారు. 

జోగుగూడెంలో మంగళవారం మృతి చెందిన బట్టు చిన్న శంకర్ (55) మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మాజీ ఎంపీపీ ఎం.సరిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాలు ఇవ్వాలని  జర్నలిస్టుల వినతి

 మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కామేపల్లి జర్నలిస్టులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.