ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కోరం కనకయ్య 

కామేపల్లి, వెలుగు :  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం కామేపల్లి రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​ ​చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తోందని తెలిపారు.

త్వరలో బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్  తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక 

కామేపల్లి మండలంలోని పొన్నెకల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల నాయకుడు మాలపోలు గోపికృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరి కొంతమందికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఆస్పత్రి తనిఖీ

ఇల్లెందు : ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే కోరం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.