
- ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి వెలుగు: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. సోమవారం కామేపల్లి రైతు వేదికలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ పండు చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన విమర్శించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామిరెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, తహసిల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్, కామేపల్లి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం, మాజీ ఎంపీపీ మాలోత్ సరి రామ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తే అహ్మద్ పాల్గొన్నారు.