గోదావరిఖని, వెలుగు: నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ కొత్త భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌లో పూర్తి స్థాయిలో వసతుల కల్పనకు మరో రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
మీటింగ్‌లో సింగరేణి జీఎం శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎం.వంశీ, జడ్పీటీసీ నారాయణ, కార్పొరేటర్ పులేందర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.