
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో ఖాళీ కానున్న ఐదు స్థానాలు, తెలంగాణలోని ఐదు సీట్లకు ఈసీ సోమవారం (ఫిబ్రవరి 24) షెడ్యూల్ ప్రకటించింది. 2025, మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుండగా.. 2025, మార్చి 20న పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, రియాజుల్ హుస్సేన్ల పదవి కాలం 2025, మార్చి 29తో ముగియనుంది. తెలంగాణ అసెంబ్లీలోని ప్రస్తుత బలాబలాల ప్రకారం.. అధికార కాంగ్రెస్కు నాలుగు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు పదవీ కాలం ముగియనుంది. ఏపీ అసెంబ్లీ సంఖ్య బలం ప్రకారం.. ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికే దక్కనున్నాయి.