కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

దుబ్బాక, వెలుగు:  అక్భర్​పేట, భూంపల్లి మండల పరిధిలోని రామలింగేశ్వర(కూడవెళ్లి) ఆలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్యతో కలిసి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.  ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్రీ హెల్త్​ క్యాంప్​ను సందర్శించి, వాటర్​ ఫిల్టర్​ ప్రారంభించారు. 

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టీల్​ బాటిల్స్​ పంపిణీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో దౌల్తాబాద్​, అక్భర్​పేట భూంపల్లి, దౌల్తాబాద్​, మిరుదొడ్డి, తొగుట మండలాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. దుబ్బాక మున్సిపల్​ సర్వ సభ్య సమావేంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.