కూడవెళ్లి జాతరలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక పూజలు 

కూడవెళ్లి జాతరలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి  ప్రత్యేక  పూజలు 

దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలం అక్బర్‌‌‌‌‌‌‌‌పేట, భూంపల్లి మండలం కూడవెళ్లి గ్రామంలోని రామలింగేశ్వరాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. కూడవెళ్లి వాగులోని స్నాన ఘట్టాలను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కూడవెళ్లి జాతరకు వసతులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు.

బీఆర్ఎస్​ హయాంలో జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించామన్నారు. జాతరలో పోలీసు బందోబస్తు సక్రమంగా లేదని, కొద్దిపాటి సిబ్బందితో విధులు నిర్వహిస్తే జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. అనంతరం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో, అల్వాల గ్రామంలో నిర్వహించిన సీతారాముల కల్యాణాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య ఉన్నారు.