
దుబ్బాక, వెలుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను దుబ్బాకలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. దుబ్బాకలో యంగ్ ఇండియా, దుబ్బాక మండలం హబ్షీపూర్నుంచి పట్టణ పరిధిలోని లచ్చపేట వార్డుకు నాలుగు లేన్ల రోడ్డుకు నిధులను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యంగ్‌ఇండియా స్కూల్‌కు తగినంత స్థలాన్ని అందజేస్తామని చెప్పడంతో సానుకూలంగా స్పందించిన సీఎం.. దుబ్బాకలో స్థల పరిశీలన చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దుబ్బాక మండలం హబ్షీపూర్నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డు వరకు నాలుగు లేన్ల రోడ్డుకు మోక్షం లభించనున్నదని, రోడ్డు అభివృద్ధి కోసం రూ.35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అడిగిన వెంటనే స్పందించిన సీఎంకు నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.