జైనూర్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం హైమన్ డార్ఫ్ వర్ధంతికి సంబంధించిన పాంప్లెంట్లను జైనూర్లో హైమన్ డార్ఫ్ యూత్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి విడుదల చేశారు. ఈ నెల 11న జైనూర్లోని మర్లవాయి గ్రామంలో నిర్వహించనున్న వర్ధంతి సభను సక్సెస్ చేయాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
జంగం గ్రామంలో జంగో లింగో దీక్షల ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్ కొడప హన్ను పటేల్, మర్లవాయి రాయి సెంటర్ సార్ మేడి జుగ్నక్ దేవురావు, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మాజీ సర్పంచ్లు మడావి భీంరావు, కనక ప్రతిభ, ధరంసింగ్ మెస్రం నాగోరావ్, కుమ్ర శ్యాంరావు, బీఆర్ఎస్ సిర్పూర్ యు ప్రెసిడెంట్ ధర్మా రావు పాల్గొన్నారు.