
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించారు. పార్టీ మారుతున్నారన్న వార్తలను ఆమె ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్‌లోనే కొన సాగుతానని స్పష్టం చేశారు. తనపై కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తనతో పాటు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు.