అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తం : కేఆర్​ నాగరాజు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తం : కేఆర్​ నాగరాజు

హసన్​పర్తి, వెలుగు: రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేస్తున్నామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు స్పష్టం చేశారు. గురువారం గ్రేటర్ వరంగల్ 56, 65వ డివిజన్ జవహార్ నగర్ కాలనీ కమిటీహాల్ వద్ద రూ.3.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రూ.15 లక్షల జనరల్ నిధులతో నిర్మించనున్న రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేశారు. 65వ డివిజన్​ దేవన్నపేట ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులు, జడ్పీహెచ్​ఎస్​ స్కూల్​లో ఎస్డీఎఫ్ నిధులు రూ.4.6 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు.

 అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ దివ్యారాణి, కాంగ్రెస్ పార్టీ డివిజన్​అధ్యక్షులు కోంక హరిబాబు, అయ్యల రాంరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల పవన్ కల్యాణ్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోలెపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.