లిస్టులో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి : ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

లిస్టులో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి : ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

పర్వతగిరి, వెలుగు:  గ్రామాల్లో  సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు అన్నారు.  వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్​, చౌటపల్లిలో గురువారం జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.  చౌటపల్లిలో జరిగిన గ్రామసభలో రూ.18 లక్షల విలువైన 60  సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లిస్టులో పేరులేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ఎవరైనా డబ్బులు అడిగితే  టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 కి కాల్ చేసి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్​, డీపీవో కల్పన, తహసీల్దార్​ వెంకటస్వామి,  ఎంపీడీవో శంకర్ నాయక్,మామునూర్​ ఏసీపీ తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్​ నాయక్​,  జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు, సెక్రటరీలు విక్రమ్​, రఘు తదితరులు పాల్గొన్నారు.