వర్ధన్నపేట/ పర్వతగిరి, వెలుగు : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. శుక్రవారం వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో ఆరుగురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.1.10 విలువైన చెక్కులను అందజేసి వెళ్తుండగా, ఇల్లంద సమీపంలో వరి నాట్లు వేస్తున్న బంజార మహిళా కూలీల వద్దకు వెళ్లి పలుకరించారు.
వారితో కలిసి కాసేపు వరి నాట్లేశారు. దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. పర్వతగిరి మండలం పోపనపల్లి దూడల మల్లన్న జాతర పోస్టర్ను ఎమ్మెల్యే నాగరాజు ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లపై చైర్మన్, గ్రామస్తులతో మాట్లాడారు.