
జోగిపేట, వెలుగు : విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ స్కీం వల్ల జిల్లాలో 1.23 లక్షల మంది స్టూడెంట్స్ లబ్ధిపొందుతారని పేర్కొన్నారు.
దసరా తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభమవుతుందన్నారు. భోజన విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహరం చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కమిషనర్ తిరుపతి, ఎంఈవో కృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణ, డీటీ మధుకర్ పాల్గొన్నారు.