రాజన్నసిరిసిల్ల, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మంగళవారం సిరిసిల్లలో పర్యటించారు. ముస్తాబాద్ కేంద్రంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య కుమారుడి వివాహం జరగగా కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్త రాచమడుగు సంతోష్ రావు, సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్ రావు తండ్రి కిషన్ రావు ఇటీవల మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
సిరిసిల్ల కౌన్సిలర్ దార్ల కీర్తన-సందీప్ మామ, 10వ వార్డు చంద్రంపేటలో బీఆర్ఎస్ నేత నరసయ్య తమ్ముడు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం తన క్యాంపు ఆఫీసులో సిరిసిల్ల సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో చర్చించారు.