ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయండి.. సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ

ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయండి..  సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలన్నారు. ప్రజల కోరిక మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎంను రేవంత్ కోరారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో  కేటీఆర్ ప్రస్తావించారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను ప్రజల తరఫున నిర్వహిస్తున్నామని తెలిపారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, మీరు అసెంబ్లీలో చెప్పిన మాట అవగింజంత వాస్తవమే అయితే వెంటనే ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు కేటీఆర్.  రాష్ట్ర ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజుల రూపంలో తీసుకోకుండా వారి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.