రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ లో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు నూతన గృహ ప్రవేశ వేడుకకు ఉత్సవానికి హాజరయ్యారు.
అంతకుముందు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ నిర్మాణాన్ని పరిశీలించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప పడిపూజలో పాల్గొన్నారు. పోతుగల్ లో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ చైర్ పర్సన్ అరుణ, ఎంపీపీ రేణుక, బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.