
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తడిసిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన మొక్కజొన్నను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, అధికారులతో చర్చించి పంటను కొనుగోలు చేస్తామని తెలిపారు. అకాల వర్షంతో జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ రమణారావు, డైరెక్టర్ గబ్బి రాజశేఖర్ పాల్గొన్నారు.
కందనూలు: తిమ్మాజిపేట మండలం ఆవంచ, బుద్ధసముద్రం, బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంగనూరు గ్రామంలో అకాల వర్షంతో నేలకొరిగిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఏడీఏ పూర్ణచందర్ రెడ్డి, ఏవో నీతి, పీఏసీఎస్ చైర్మన్ బాలరాజు గౌడ్, తిరుపతయ్య, వెంకట స్వామి పాల్గొన్నారు.