- మంత్రి ఉత్తమ్‌ను కోరిన ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి, వెలుగు : అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణం కోసం ఫండ్స్ మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ను ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలను పూర్తి చేయడం వల్ల ప్రతి ఎకరాకు సాగునీరు అందించగలుగుతామని ఎమ్మెల్యే తెలిపారు.
కాల్వలను పూర్తి చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన ఎస్టిమేట్స్‌ను అందించారు. అవసరమైన ఫండ్స్మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వినతికి స్పందించిన మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. చిన్నేరువాగుపై వడపర్తి, అనాజీపురం, బొల్లేపల్లి, మాదారం వద్ద చెక్ డ్యాంలు నిర్మించాలని కోరారు. దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్తోపాటు పూర్తి వివరాలు అందించాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. అనంతరం బొల్లేపల్లి, బీమలింగం, అలీనగర్ కాల్వల అభివృద్ధిపై మైనర్ ఇరిగేషన్ ఈఎన్సీ చంద్రశేఖర్‌తో ఎమ్మెల్యే కుంభం చర్చించారు.