యాదాద్రి, వెలుగు : జిల్లా ప్లేయర్లు స్టేట్ లెవల్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపి మెడల్స్ సాధించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆకాక్షించారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, భువనగిరిలో త్వరలోనే స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను ఈ నెల 10న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే స్టేట్ లెవల్ అథ్లెటిక్స్‌కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్, గోనూరు శ్రీనివాస్, మాటూరి వినోద్, ఆంబోజు అనిల్ కుమార్, ఎర్ర యాదగిరి, సత్యనారాయణ, సునీల్, మల్లేశ్, సతీశ్, కుమార్, లావణ్య, జ్యోతి, అనిత పాల్గొన్నారు.