భూదాన్ పోచంపల్లి, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువును ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. డిసెంబర్ లో జలాల్పూర్ చెరువు వద్ద వరుసగా రెండు ప్రమాదాలు జరగడంతో ఎమ్మెల్యే రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలాల్పూర్ చెరువులో కారు ప్రమాదం జరిగి యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు.
చెరువు చుట్టూ ఫెన్సింగ్, మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పు సంబంధించి టెండర్ పనులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం పోచంపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించాడు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భరత లవకుమార్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఉన్నారు.