యాదాద్రి, వెలుగు: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి గెలిచిన 50 రోజుల తర్వాత క్యాంప్ ఆఫీసులోకి అడుగు పెట్టారు. సోమవారం పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించి ఆఫీసులోకి వెళ్లారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఈ ఆఫీస్‌లో వాస్తు లోపాలు ఉండడంతో ఎమ్మెల్యే ఇన్నాళ్లు ఆగినట్లు పార్టీ నేతలు తెలిపారు. వాటిని సరిదిద్దిన తర్వాతే ముహూర్తం చూసుకొని క్యాంపు ఆఫీసులోకి అడుగు పెట్టినట్లు వివరించారు.