
పాల్వంచ, వెలుగు: రెండున్నర దశాబ్దాలుగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోని పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు హామీ ఇచ్చారు. సోమవారం పట్టణం మండలాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. స్థానిక కేశవాపురంలో నవభారత్ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన అదనపు తరగతిగదులు, టాయిలెట్స్ ను ఆయన ప్రారంభించారు.
స్థానిక పాలకోయ తండాలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ రాంప్రసాద్, మున్సి పల్ కమిషనర్ కే. సుజాత, తహ సీల్దార్ వివేక్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.