బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా తయారు కావడానికి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. శాంతి భద్రత సమస్యలు సృష్టించడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు కూనంనేని. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Also Read :- కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు..మెగా హెల్త్ చెకప్ లాంటిది
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని... ఎందుకు నెరవేర్చలేక పోతున్నామో ఆ పార్టీ ఆలోచించుకోవాలని అన్నారు.
హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని.. శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. హైడ్రా..పెద్దవాళ్ళ గుండెల్లో బాంబ్ కావాలని..పేదల గుండెల్లో కాదని అన్నారు.మూసీ పునర్జీవ పథకం విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని సీపీఐ భావిస్తుందని అన్నారు.