సుజాతనగర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిర్వాహకులకు సూచించారు. స్థానికంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరరావు ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. బోనస్ పొందాలంటే తప్పని సరిగా ప్రభుత్వ నింబందనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, సెక్రటరీ సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, డీటీ నాగరాజు, ఎంపీడీవో భారతి, ఏవో నర్మద పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరిలో దయా గుణం ఉండాలి
పాల్వంచ : ఏ కులం వారైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునే దయాగుణం ప్రతీ ఒక్కరిలో ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్య ప్ప లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ సమీపంలో నిర్వహించిన కమ్మ సేవా సంఘ వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ సంఘ భవిష్యత్తు కోసం అడుగులు వేసినప్పుడే ఆయా సంఘాలు బలోపేతం అవుతాయన్నారు. పాల్వంచలో కమ్మ సేవా సంఘం భవిష్యత్ ప్రణాళికతో సుమారు రెండు ఎకరాల స్థలాన్ని సేకరించడం అభినందనీయమన్నారు.
భవన నిర్మాణానికి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి రమేశ్, మున్సిపల్ కమిషనర్ కొడారు సుజాత, జెన్కో ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాస బాబు, తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోనేరు సత్య నారాయణ, బాలోత్సవ్ మాజీ కన్వీనర్ డాక్టర్ రమేశ్‌బాబు, జడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, తాళ్లూరి జీవన్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.