భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్వాలిటీ లేకుండా పనులు చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొందరు నామినేషన్ల టైంలో వస్తారు.. మళ్లీ కనపడరు కానీ, తాను ఫైటర్‌ను అని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. ప్రగతి మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు.
కేంద్రీయ విద్యాలయం, ఎయిర్‌పోర్టు, హరిత హోటల్ లాంటి వాటితో వందలాది మందికి ఉపాధి దొరుకుతొందని చెప్పారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు వచ్చేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్కాపు సీతాలక్ష్మి, మున్సిపల్కమిషనర్ శేషాంజన్‌స్వామి, తహసీల్దార్ పుల్లయ్య, డీఈ రవీందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, కౌన్సిలర్లు ప్రసాద్, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, విజయ్, ఎ.వేణు, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్ల శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, యూసుఫ్ పాల్గొన్నారు.