రిజర్వేషన్లు ఎంత పెంచుతారో చెప్పాలి: ఎమ్మెల్యే కూనంనేని

రిజర్వేషన్లు ఎంత పెంచుతారో చెప్పాలి: ఎమ్మెల్యే కూనంనేని

కులగణనపై  అసెంబ్లీలో  చర్చపెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దన్నారు సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కులగణనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయన్నారు. సర్వేను సభలో పెట్టారు..దీని ఉద్దేశమేంటో చెప్పాలన్నారు.  3 లక్షల కుటుంబాలు సర్వేలు పాల్గొనలేదని చెప్పారు. ఒక పనిచేస్తే విమర్శలు కామన్ అని అన్నారు. సమాచారం దాస్తే ఎవరికేం ఉపయోగమో  తనకు  తెల్వదన్నారు.  ప్రభుత్వంపై విమర్శల కంటే సూచనలు ఇస్తే బెటరని అన్నారు కూనంనేని.

కులగణన  లిస్ట్ ను గ్రామాల్లో పెట్టి మిగిలిన వారి పేర్లు నమోదు చేయాలి.  రీ సర్వే చేయాలంటే ఎప్పటికీ అవ్వదు.  2014 సర్వేను ఈ సర్వేతో పోల్చకూడదు
ఒక్కరోజులో హడావిడిగా చేసిన సర్వేకు ఈ సర్వేకు చాలా తేడా ఉంటది.   సర్వేను సభలో పెట్టారు దీని ఉద్దేశం ఏంటి.?. బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా..పెంచితే ఎంత.  లేకపోతే ఈ సర్వే కాగితాలకే పరిమితమవుతుంది.  50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీం చెప్పింది.  జడ్జిమెంట్ కు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందా?. కామారెడ్డి లో 44 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు.  ఎంత పెంచినా ప్రాక్టికల్ గా ఉండాలి. ఇక్కడ చర్చపెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు.  

బీసీ, ఎస్సీలకు ఉన్న మేధస్సు, పనితనం ఎవరికీ లేదు.  నైపుణ్యం ఎక్కువున్న వాళ్లలో బీసీలే ఎక్కువ. నేర్పరితనం ఉన్నవాళ్లను కులంపేరుతో బంధించారు
గ్రామంలో ఒకరికి ఉద్యోగం వస్తే వందల మందిని ప్రభావితం చేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో కులగణన ప్రయత్నం ఎప్పుడు జరగలేదు అని కూనంనేని అన్నారు.