భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో త్వరలో ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగనున్నదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు కావాలని జిల్లా వాసులు ఎన్నో ఏండ్లుగా కలలు కంటున్నారన్నారు. విమానాశ్రయంతో పాటు కొత్తగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, డీఈ రవి కుమార్, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కౌన్సిలర్లు సత్యభామ, సహేరా బేగం, బోయిన విజయ్ కుమార్, పి. సత్యనారాయణ చారి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాయకులు యూసుఫ్, మాచర్ల శ్రీనివాస్, రమేశ్, రాములు, ఆనంద్ పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
పాల్వంచ : యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు. కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘యువత సాధికారత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు.
ఆ దిశగా కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూత్ ఎంపవర్మెంట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పన, జిల్లా కోఆర్డినేటర్ రూప్లా నాయక్, సీపీఐ జిల్లా కార్య దర్శి ఎస్కె సాబీర్ పాషా, కొల్లి ఫౌండేషన్ వాలంటీర్లు మోహన్, బి రమేశ్, జలీల్, అజ్జు పాల్గొన్నా రు.