జిల్లాకు మెడల్స్​ తేవాలి : కూనంనేని సాంబశివరావు

జిల్లాకు మెడల్స్​ తేవాలి : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీఎం కప్​రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లాకు అత్యధిక మెడల్స్​ తెచ్చేందుకు కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు హైదరాబాద్​లో జరుగనున్న క్రీడాపోటీలకు జిల్లా నుంచి క్రీడాకారులు వెళ్లే వెహికల్స్​ను గురువారం ఆయన జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల్లో నెలకొన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్​ క్రీడాపోటీలు ఎంతగానో దోహన పడుతాయన్నారు. ఈ ప్రోగ్రాంలో క్రీడలు, యువజన శాఖ జిల్లా అధికారి పరంధామరెడ్డి, డీసీఎంఎస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాస్, కాంగ్రెస్​ నేత నాగ సీతారాములు, పలువురు పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.