పాల్వంచలో 100 పడకల ఆసుపత్రికి కృషి చేస్తా : కూనంనేని సాంబ శివరావు

పాల్వంచలో 100 పడకల ఆసుపత్రికి కృషి చేస్తా : కూనంనేని సాంబ శివరావు
  • ఎమ్మెల్యే కూనంనేని  సాంబశివరావు 
  •  డయాలసిస్ సెంటర్ ప్రారంభం

పాల్వంచ, వెలుగు : అత్యధికంగా గిరిజన గ్రామాలు, జాతీయ రహ దారి పక్కనే ఉన్న పాల్వంచలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి  చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అనుబంధంగా 5 బెడ్లతో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యశాల ఆధునీకరణ పనుల కోసం మరో రూ.79 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఈ కార్యక్ర మంలో డీసీ హెచ్ఎస్ డాక్టర్ రవి బాబు, సూపరింటెండెంట్ రాంప్ర సాద్, మున్సిప ల్ కమిషనర్ డాకూ నాయక్, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఇన్​చార్జ్ డీఎం హెచ్ వో డాక్టర్ సుకృత, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, ప్రముఖ డాక్టర్ ఎస్ రామ్మోహన్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డాక్టర్ సోమరాజు దొర పాల్గొన్నారు.