
- ..8 మంది క్షేమంగా బయటకు రావాలి: ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది క్షేమంగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పదేండ్లుగా పట్టించుకోకుండా ఉన్న శ్రీశైల సొరంగ మార్గాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరమని తెలిపారు. టన్నెల్ పనులు ప్రారంభించే ముందు టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన లాజికల్ సర్వే అధికారులు ఏమరపాటుతో ఈ ఘటన జరిగి ఉండవచ్చని తెలుస్తుందని చెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే: చాడ
ఎస్ఎల్ బీసీ ప్రమాదానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. 20 సార్లు మా ర్పులు చేయడంతో సొరంగ మార్గం అంచ నాలు పెరిగి ఆలస్యం జరిగిందని తెలిపారు.