కేసీఆర్ ఓడిపోయి తప్పించుకుండ్రు: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

కేసీఆర్ ఓడిపోయి  తప్పించుకుండ్రు: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
  • బీఆర్ఎస్ పార్టీ బతికి ఉండాలె

  • బీజేపీ విషపు పాము లాంటి పార్టీ

  • డబ్బులతో పని లేని ఎన్నికలు రావాలె

  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 
గోదావరిఖని : కేసీఆర్ ఓడిపోయి  తప్పించుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో జరిగిన ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్  సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బతికి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వ లోగో పై బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.  ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా కొత్త ప్రభుత్వం పని చేయాలని సూచించారు.  రాష్ట్రంలో ఏ రంగం సంతృప్తి కరంగా లేదన్నారు.  

పదేండ్లలో  సింగరేణి ని విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు.   దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకారి అని, ఆ పార్టీ విషపూరితమైన పాము లాంటిదన్నారు. అధికారం కోసం మోదీ ఎంతటికైనా దిగజారుతున్నారని ఆరోపించారు.   కాంగ్రెస్ పార్టీ గెలుపులో కమ్యూనిస్టు పార్టీ భాగస్వామ్యం ఉందన్నారు. డబ్బులతో పని లేని ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.