ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం ప్రారంభించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో కొత్తగా నిర్మించిన ఫారెస్ట్​ డివిజనల్​ మేనేజర్స్​ ఆఫీస్​ కాంప్లెక్స్​ను సీఎం రేవంత్​ రెడ్డి హైదరాబాద్​ నుంచి వర్చువల్​ పద్ధతిలో ప్రారంభించగా ఇక్కడ ఎమ్మెల్యే హాజరయ్యారు. కాంప్లెక్స్​తో పాటు ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్ల క్వార్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కలెక్టర్​ తో కలిసి మొక్కలు నాటారు.  

పర్యాటక హబ్ గా కిన్నెరసాని

పాల్వంచ : అత్యధిక అటవీ భూభాగంతో నిండి ఉన్న కిన్నెరసానిని పర్యాటక హబ్ గా తీ ర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.  కిన్నెరసాని పర్యాటక కేంద్రంలో కొత్తగా నిర్మించిన రేంజ్ ఆఫీస్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 

సత్తుపల్లి : సత్తుపల్లిలోని ఫారెస్ట్ కార్పొరేషన్ కార్యాలయ భవనంతో పాటు సిబ్బంది క్వార్టర్స్ ను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీఎఫ్ వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్ డివిజనల్ మేనేజర్ గణేశ్, ఎఫ్ డీవో మంజుల రిబ్బన్ కట్ చేశారు. సత్తుపల్లి, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆనంద్, నీరజ ఉన్నారు.