రామలింగేశ్వరుడికి ఎమ్మెల్యే పూజలు

హాలియా, వెలుగు:  నల్గొండ జిల్లా అనుమల మండలం హజారిగూడెంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు నారాయణ గౌడ్, నరేందర్​రెడ్డి, వెంకటరెడ్డి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, ఆంజనేయులు, ఆలయ కమిటీ చైర్మన్ మన్నెం కృష్ణమూర్తి పాల్గొన్నారు.