రాజకీయాలకతీతంగా మున్సిపాలిటి అభివృద్ధి : కుందూరు జై వీర్ రెడ్డి

రాజకీయాలకతీతంగా  మున్సిపాలిటి అభివృద్ధి : కుందూరు జై వీర్ రెడ్డి
  • నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి 

హాలియా, వెలుగు: రాజకీయాల కతీతంగా హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ కార్యాలయంలో  పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా  మాట్లాడారు. హాలియా మున్సిపాలిటీలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి, మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. గత పాలకులు  మున్సిపాలిటీలో అభివృద్ధి నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులను కొంతమేరకు వృథా చేశారని, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో  విఫలం చెందారని అన్నారు. 

అనంతరం పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ పిల్లి చంద్రకళ పాల్గొన్నారు.