ఎమ్మెల్యే కాన్వాయ్​లో అదుపు తప్పిన వాహనం

ఎమ్మెల్యే కాన్వాయ్​లో అదుపు తప్పిన వాహనం

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండలం చేపూరు సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్రంపూడ్ మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి హాజరయ్యారు. 

అనంతరం తిరిగి హాలియాకు వెళ్లే క్రమంలో చేపూరు ఎక్స్​రోడ్డు సమీపంలోని రోడ్డు వెంట మట్టికుప్పుండడంతో దానిని ఎమ్మెల్యే కాన్వాయిలోని ఓ కారు ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి వాహనం రోడ్డు పక్కకు ఉన్న బీడు భూమిలోకి దూసుకెళ్లింది. దీంతో కాన్వాయి వాహనం పాక్షింగా దెబ్బతిన్నది. అందులో ఉన్న వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.