హాలియా, వెలుగు : ప్రతిఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సూచించారు. హాలియా మున్సిపాలిటీలోని పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వేద మంత్రాలు మధ్య స్వామివారి కల్యాణాన్ని వైభవంగా చేపట్టారు. స్వామివారి కల్యాణానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హాలియా పట్టణం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, కౌన్సిలర్ చంద్రారెడ్డి, దేవాలయ చైర్మన్ చెరుపల్లి ముత్యాలు, గౌరవ సలహాదారుడు పిట్టల శంకర్, జిల్లా నాయకులు రాజారమేశ్ యాదవ్, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.