మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.  గురువారం హాలియా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటిన్​ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వివిధ రకాల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోనే మొదటిసారిగా హాలియాలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల కోసం ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లు బ్యాక్, సోలార్ పవర్ జనరేషన్, ఉచిత బస్సు, మొబైల్ ఫిష్ అవుట్ లెట్లు, మిల్క్ పార్లర్లు వంటి సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.

మహిళా సంఘాల్లో ఇప్పటివరకు చేరని సభ్యులను గుర్తించి కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.  కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్ కుమార్, మార్కెట్​చైర్మన్​చంద్రశేఖర్​రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్​అనుపమానరేందర్​రెడ్డి, కమిషనర్​ఎం.రామదుర్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.