ఆస్తి పన్నులు తగ్గిస్తాం : ఎమ్మెల్యే కూసుకుంట్ల

  • ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ  పరిధిలో ఆస్తి పన్నులను తగ్గించేందుకు  కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిల్  సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంటి పన్నులు భారంగా మారాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నాగులకుంటను పార్కుగా మారుస్తామని, గాంధీ పార్క్ ను అభివృద్ధి చేస్తామన్నారు.

కాగా మున్సిపాలిటీలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లు, చిన్న కొండూరు రోడ్డులోని శ్మశానవాటికకు దారి ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఖర్చుపెట్టేందుకు తీర్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్  రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ కమిషనర్ భా స్కర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు