హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండలోని న్యూ శాయంపేటలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న రజక విద్య భవన్ కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలను ఆదుకుంటుందన్నారు.
బలహీన వర్గాల వారు విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, హైకోర్టు జడ్జి నంద, కార్పొరేటర్ మామిళ్ల రాజు యాదవ్, రజక సంఘం పెద్దలు పాల్గొన్నారు.