నిజాంసాగర్, (ఎల్లారెడ్డి )వెలుగు : జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావ్ అన్నారు. ఆదివారం నిజాంసాగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలన్నారు.
అనంతరం మండల కేంద్రంలో ఇప్తార్ విందులో పాల్గొని మైనారిటీ నాయకులతో కలిసి డిన్నర్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు జయ ప్రదీప్, కిష్ట రెడ్డి, పండరి తదితరులు పాల్గొన్నారు.