బీఆర్ఎస్ ఛలో నల్గొండ సభ ముగిసిన అనంతరం వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాలన్నీ ఒకేసారి వాడంతో చర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈక్రమంలో ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న హోంగార్డ్స్ ని ఢీ కొట్టి స్విఫ్ట్ కార్ బోల్తా కొట్టింది. వెనుకనే వస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని కారు హోంగార్డు పై నుండి వెళ్లింది.
ఈ ఘటనలో హోంగార్డు మృతి చెందాడు. మరో హోంగార్డుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన హోంగార్డ్ ను నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కిషోర్ గా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.