- మదన్ లాల్ గెలుపునకు కృషి చేయాలి
- వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
కారేపల్లి, వెలుగు : తనకు అసెంబ్లీ టికెట్ రాలేదనే బాధ ఏమాత్రం లేదని, చాలా హ్యాపీగా ఉన్నానని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ చెప్పారు. కారేపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ఆదేశాల ప్రకారం ప్రతికార్యకర్త వైరా బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలిపునిచన్చారు.
ALSO READ: తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ సభను సక్సెస్ చేయాలి: మోహన్ కుమార్ మంగళం
కేసీఆర్తన గుండెల్లో ఉన్నారని, ఆయన ఆదేశాలను తప్పక పాటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీపీ శకుంతల, జడ్పీటీసీ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.