నర్సాపూర్ టికెట్ నాదే.. సీటు వదిలే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ టికెట్ నాదే.. సీటు వదిలే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ టికెట్ ను  వదిలే ప్రసక్తే  లేదని.. తనకే సీటు  వస్తుందని ధీమా వ్యక్తం చేశారు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.  తనకు టికెట్ రాకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. కేసీఆర్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని..  నర్సాపూర్ టికెట్ పై పునరాలోచన చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 

సునీత లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా.. డిప్యూటీ సీఎం ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు మదన్ రెడ్డి. నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు తనకే ఉందని  చెప్పారు. నర్సాపూర్ లో పార్టీని ముక్కలు చేయొద్దన్నారు. చంద్రునికి సూర్యునికి గ్రహణం పట్టినట్లు తనకు కూడా గ్రహణం పట్టిందని త్వరలోనే తొలగిపోతుందని తెలిపారు.   నర్సాపూర్ బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఓపికగా ఉండాలని సూచించారు.