నర్సాపూర్ టికెట్..వదులుకునే ప్రసక్తే లేదు: మదన్ రెడ్డి

  • ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించకపోవడం 
  • బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌కు అవమానం: ఎమ్మెల్యే మదన్ రెడ్డి 

మెదక్(చిలప్‌‌చెడ్), వెలుగు : రాష్ట్రంలో 115 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి, మెదక్ జిల్లా నర్సాపూర్ సీటు ఆపడం నియోజకవర్గానికి కాదు.. బీఆర్ఎస్ పార్టీ కూడా అవమానకరమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మండలంలోని సోమక్కపేటలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నర్సాపూర్ టికెట్‌‌ను వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: 19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు : డ్రగ్స్  కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

‘‘నాకు హైదరాబాద్‌‌లో సింగిల్ బెడ్రూమ్‌‌ ఇల్లు కూడా లేదు. తాను ప్రజా బలం ఉన్న వ్యక్తిని. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిచి తీరుతా. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు వేయించా. మంజీరా నది, హల్దీ వాగు మీద 14 చెక్ డ్యామ్‌‌లు నిర్మించాను”అని ఎమ్మెల్యే తెలిపారు.